జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహం తీసుకురావడానికి కోసం,పెద్దాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు ట్రాక్టర్ లో కోరుట్లకు బయలుదేరారు.మార్గమధ్యంలో పెద్దాపూర్ గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి కెనాల్ లోకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో ఓ యువకుడు గల్లంతు కాగా ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.గల్లంతైన యువకుడు మెట్ పల్లి మండల మాజీ జెడ్పిటిసి కాటిపల్లి రాధ కుమారుడు శ్రీకర్ రెడ్డి గా గుర్తించారు.కెనాల్ లో యువకుని ఆచూకి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.