ఇడుపులపాయ మాజీ సర్పంచ్ పోతిరెడ్డి చలపతి జనసేన పార్టీలో చేరారు. అదివారం విశాఖపట్నంలో ఉన్న జనసేనా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇడుపులపాయ మాజీ సర్పంచ్ పోతిరెడ్డి చలపతి జనసేనా కండువాను వేసుకున్నాడు. ఇడుపులపాయ పంచాయతీ పరిధిలో కాపు వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. మాజీ సిఎం జగన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ చలపతి జనసేనలో చేరడంతో వైసీపీ పార్టీకి బీటలు పడ్డాయాని పలువురు అంటున్నారు.