Download Now Banner

This browser does not support the video element.

గాజువాక: వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరు నక్షత్ర సందర్భంగా సుదర్శన హోమం

Gajuwaka, Visakhapatnam | Jul 31, 2025
జీవీఎంసీ 65వ వార్డు గాజువాక గరుడాద్రి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు శ్రావణమాసం గురువారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన శ్రీ సుదర్శనుల తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో సుదర్శన హోమం అభిషేకం ప్రత్యేక పూజలు వేద పండితులు మంత్రాచోలతో అత్యంత వైభవముగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హిందూ ధర్మ రక్షణ సమితి అధ్యక్షురాలు కొత్తలంక భువనేశ్వరి శర్మ పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఉత్తర ముఖాన వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయాలలో గరుడ గరుడాద్రి కొండ ప్రముఖమైనదని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us