అల్లూరి జిల్లా హుకుంపేట మండలం కొంతిలి గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుని ఉత్సవాల్లో భాగంగా అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడికి చేరుకుని దింసా నృత్యం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో ఆయన నేరుగా పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి దింసా నృత్యం చేస్తూ అలరించారు. గ్రామాల్లో దైవభక్తి కలిగి మంచి సాంప్రదాయ సాంస్కృతులను పాటించాలని అలాంటి ప్రదేశాల్లో అభివృద్ధి తప్పకుండా జరుగుతోందంటూ ఆయన వెల్లడించారు.