ఎన్టీఆర్ భరోసా పింఛను అర్హత నోటీసులు అందుకున్న వారు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో అప్పీలు సమర్పించుకునే అవకాశం ఇంకా ఉందని, ఇప్పటికే అప్పీలు చేసుకున్న వారికి తుది నిర్ణయం పొందే వరకు పింఛన్లు ఎటువంటి అంతరాయం లేకుండా యధాతథంగా కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. అదేవిధంగా, తాత్కాలిక వికలాంగత్వం సర్టిఫికెట్లు కలిగిన అర్హులకు కూడా పింఛన్లు పంపిణీ చేయబడుతాయని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమయం ఎంత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.