రాష్ట్రంలోని నిరుపేదలకు సొంతింటి కళను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను స్థానిక సింగరేణి క్లబ్ లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.