విద్యార్థినీ,విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని,భావితరాల నిర్మాతలుగా కొనసాగాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురుపూజోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతిలోనే ఉందని, సమాజ భవిష్యత్తు వారిపై ఆధారపడి ఉందని అన్నారు.