జాతీయ క్రీడల దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి సైకిల్ రేస్ ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, రఘువరన్ జండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేలో ఇండియా బాక్సింగ్ కోచ్ నవీన్ తదితరులు పాల్గొన్నారని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి డాక్టర్ కోరుకంటి రవికుమార్ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు.