నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో బుధవారం ఉదయం అధికారులు అన్ని గేట్లను మూసివేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.10 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. త్రాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంట్లో 5524 క్యూసెక్కులు అవుట్ ఫ్లోర్ 55244 క్యూసెక్కులుగా ఉంది జిల్లా విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.