నంద్యాల జిల్లా బేతంచెర్ల సమీపాన కర్నూలు రహదారిలో ఉన్న వినాయక ఘాటును గణేశ్ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు బుధవారం పరిశీలించారు. ఈనెల 30న బేతంచెర్లలో జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా వినాయక ఘాటును నీటితో నింపే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా వినాయక ఘాట్లో విగ్రహాన్ని నెలకొల్పి, పూజలు చేశారు. కార్యక్రమంలో గణేశ్ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు హుస్సేన్ రెడ్డి, బూసి రెడ్డి, మురళి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.