ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో శనివారం దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తి తన భార్య జయమ్మ పై అనుమానం పెంచుకొని ఆమెను రోకలిబండతో కొట్టి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు అనంతరం అదే కత్తితో తన గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు అయితే తెల్లవారిన తర్వాత స్థానికులు గమనించి విషయాన్ని పోలీసులకు మరియు 108 కు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చే పరిశీలించగా నారాయణ కొనఊపిరితో ఉండటం గమనించి 108 లో పొదిలికి తరలించారు అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు నారాయణ ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు