రైతులు తాము సాగుచేసిన పంటలను తప్పక ఈక్రాప్ చేయించుకోవాలని మండల ఏవో బాలగంగాధర రెడ్డి అన్నారు మంగళవారం జీవి సత్రం సమీపంలోని గంగాయపల్లె ఉప్పుగుంటపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. పంటల సాగులో అనుసరించాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. ప్రభుత్వ రాయితీలు పొందాలంటే ఈ క్రాప్ తప్పక చేయించుకోవాలన్నారు.