జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నాగర్కర్నూల్ సిఐ అశోక్ రెడ్డి తెలిపారు. పాలెం గ్రామంలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి నిందితుని అదుపులోకి తీసుకున్నామని కేసు కు సంబంధించిన వివరాలను బిజినపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం వెల్లడించారు.