కాగజ్నగర్ పట్టణంలోని సర్కిల్ కాలనీలో మంగళవారం రాత్రి షేక్ నబి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి రెండున్నర తులాల బంగారు నగలను దోచుకు వెళ్లారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన యజమాని పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సురేష్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు,