గణేకల్లులో శ్మశాన వాటికకు రోడ్డుతో పాటు రేషన్ షాప్ వద్ద రోడ్లు గుంతలతో దెబ్బతిన్నాయని సీపీఎం మండల అధ్యక్షుడు వీరారెడ్డి, డీవైఎఫ్ఎ నాయకుడు చిరంజీవి పేర్కొన్నారు. అంత్య క్రియలకు వెళ్లే ప్రత్యామ్నాయ రోడ్డుపైనా నడవలేని పరిస్థితి ఉందన్నారు. పంచాయతీ నీటి సరఫరాపై అనేకసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోగా అబద్ధాలతో మభ్య పెడుతున్నారన్నారు.