ప్రజావాణి దరఖాస్తు లను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా అదనపు కలెక్టర్ కు పింకేష్ కుమార్,బెన్షాలోమ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మొత్తం 55 అర్జీలను ప్రజల నుండి స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందించిన దరఖాస్తులన్నిటిని సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.