జనగామ జిల్లా కేంద్రంలో గాయత్రి ఫంక్షన్ హాల్లో ఆదివారం కల్లుగీత కార్మిక సంఘం జనగామ మండల మహాసభ మండల కార్యదర్శి మార్క ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని,వృత్తిలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని,సేఫ్టి మోకులు వృత్తి చేసేవారందరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.