జంగారెడ్డిగూడెం ఆర్డీవో, తహసిల్దార్ కార్యాలయాల వద్ద జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆర్డిఓ మరియు తహసిల్దార్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లి పోలీస్ జులుం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ అధికారులకు వినతిపత్రం అందించారు. బాపట్లలో లాయర్ పై సిఐ,ఎస్ఐ చేసిన దాడికి నిరసనగా వారిపై కఠినచర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు తక్షణమే న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలని, న్యాయవాదులపై ఎవరైనా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.