కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులందరికీ ఎరువులు అందిస్తామని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఎరువులు, యూరియాపై వైసీపీ లేని పోని రాద్ధాంతం చేస్తుందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాలా మోసం చేసిందని మండిపడ్డారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తోందన్నారు.