నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభ యాత్రలో నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ శుక్రవారం రెండు గంటల సమయంలో హాజరై పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ నిమజ్జన సమయంలో ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని సాంప్రదాయ నృత్యాలు చేయడం వలన ఎస్పీ అభినందించారు. మండల కేంద్రంలో గణేష్ శోభాయాత్రకు డిఎస్పీ లు లింగయ్య, మహేష్, మక్తల్ సీఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతున్నందున చెరువు దగ్గర అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అధికారులకు సూచించారు.