Araku Valley, Alluri Sitharama Raju | Aug 23, 2025
ముంచంగిపుట్టి మండలం డుడుమ జలపాతం వద్ద ప్రమాదవశాత్తు జారిపడి పర్యాటకుడు గల్లంతైన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. శనివారం సాయంత్రం ఒడిస్సా లోని బరంపురంకు చెందిన సాగర్ తుడు,అభిజిత్ బెహరా లు కలిసి విహారయాత్ర కోసం డుడుమ జలపాతం వద్దకు వచ్చారు. అయితే డుడుమ అందాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తుండగా డుడుమ జలాశయం నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో సాగర్ తుడు జలపాతంలో కొట్టుకుపోయాడు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.