మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సార్వాయిపేట గ్రామంలో బుధవారం సాయంత్రం రైతు రాజమల్లు పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో సమాచారం అందుకున్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించి స్థానిక ఎస్‌ఐకి ఫోన్ చేసి రైతు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబానికి అండగా ఉంటామని, కావాల్సిన సహాయం అందించేందుకు ముందుంటామని బరోసా కల్పించారు.