పాతపరదేశీపాలెం, కొండపేట నూతన కాలనీలో వినాయక చవితి పంచరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రెండవరోజు గురువారం రాత్రి దీపాలంకరణ సేవ కార్యక్రమం నిర్వహించారు. దీపాలంకరణ సేవలో 516 దీపాలతో వినాయక, శివలింగాల చిత్రాలకు నూనె దీపాలను అలంకరించి దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో వినాయకుని నినాదాలు చేసారు. అనంతరం వినాయకుని నైవేద్యం ప్రసాదం గా స్వీకరించారు.