రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విజయవంతమైన సందర్భంగా శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కొలిమిగుండ్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్త్రీ శక్తి విజయోత్సవ సభపురస్కరించుకొని స్థానిక ఆర్టీసీ బస్టాండు నుంచి జమ్మలమడుగు సర్కిల్ వరకు మహిళలతో కలిసి ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని పేర్కొన్నారు.