పామర్రు మండలం కురుమద్దాలిలోని రైతు భరోసా కేంద్రం వద్ద సోమవారం యూరియా కోసం రైతులు ఆందోళన చేశారు. యూరియా కోసం క్యూలైన్లో నిలబడిన రైతులకు ఒక్కో కట్ట మాత్రమే ఇవ్వడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. డీసీ ఛైర్మన్ చెప్పిన వారికి ఎక్కువ యూరియా బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆరోపించారు.