రుషికొండ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నాగుపాము బుధవారం హల్చల్ చేసింది. ఒక్కసారిగా పామును చూసిన భక్తులు భయాందోళన చెంది పరుగులు తీశారు. ఆలయ అధికారులు సమాచారంతో అక్కడికి చేరిన స్నేక్ క్యాచర్ కిరణ్ నాగుపామును చాక చక్యంగా పట్టుకున్నారు. ఈ పాము చాలా విషపూరితమైన కొబ్రా జాతికి చెందినదని ఆయన తెలిపారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో వదిలివేయడంతో భక్తులు, ఆలయ సిబ్బంది, ఊపిరి పీల్చుకున్నారు