కళ్యాణదుర్గంలో శుక్రవారం ఓ అమానవీయ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నవజాత శిశువు (ఆడపిల్ల) ను గ్యాస్ గోడౌన్ సమీపంలో ముళ్ళ పొదల్లో వదిలివేశారు. అసలు ఆ శిశువును అక్కడ ఎవరు ? ఎందుకు? వదిలి వేశారో తెలియడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం అర్బన్ సీఐ యువరాజు శనివారం లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు. శిశువును వదిలి వెళ్ళిన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల వారిని, స్థానికులు స్థానికులను విచారిస్తున్నారు.