ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం రహదారిలో వెళ్లే భక్తులకు ఫారెస్ట్ రేంజర్ హరి పలు సూచనలు చేశారు. రాత్రి వేళలో అటవీ జంతువులు రోడ్డు దాటుతుండడంతో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు అనుమతి లేదన్నారు. ఘాట్లో 30 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్తే 500 రూపాయలు ప్లాస్టిక్ వేసిన అడవికి నిప్పు పెట్టిన వేయి రూపాయలు ఫైన్ విధిస్తామన్నారు. వాహనదారులు అటవీశాఖ అధికారులకు సహకరించాలని కోరారు.