సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కోర్టులో ఈ నెల 14వ తేదీన లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎస్ఐ పి.వి. చరణ్ రెడ్డి గురువారం సాయంత్రం తెలిపారు. ఇరువురి ఒప్పందం మేరకు రాజీ పడే అవకాశం కోర్టు కల్పిస్తున్నందున రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవాలనుకునే వారు జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.