డోన్లోని BC హాస్టల్లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి శ్యాంసుందర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. యాడికిలోని చౌడేశ్వరి కాలనీకి చెందిన విద్యార్థి సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న తన కుమారుడు ఫోన్ చేశాడని, ఉదయం మృతిచెందినట్లు ఫోన్ వచ్చిందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని తెలిపాడు.