ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధులలో తిరుగుతూ స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇంటి బయట ఏ వస్తువులు పెట్టిన తీసుకెళ్తున్నాయని స్థానిక ప్రజలు తెలిపారు. చిన్నపిల్లలు బయట తిరగడానికి కూడా ఇబ్బందులకు గురవుతున్నారు అని తెలిపారు. సంబంధిత పంచాయతీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.