కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ భీమవరంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు భవిష్యత్తుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల నుండి బయటపడేందుకు కేంద్రం ఇప్పటికే రూ.11,500 కోట్లు మంజూరు చేసిందని, లాభాల బాట పట్టించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.అలాగే నరసాపురం–అరుణాచలం ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యులరైజ్ చేయనున్నామని హామీ ఇచ్చారు. 165వ జాతీయ రహదారి విస్తరణకు రూ.3,200 కోట్లతో DPR సిద్ధమైందని వివరించారు.