గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ ధీరజ్ వినీల్ వాహనదారులకు శనివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. అధిక శబ్దం చేసే సైలెన్సర్లు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసే వాహనాలను ఇకముందు కఠినంగా తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను గౌరవించి, నిబంధనలను పాటించి సహకరించాలని కోరారు.