చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ తవణంపల్లి మండలంలోని పుత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బోడిగుట్టలపై గ్రీన్ హిల్స్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం నుండి 1600 చింత, సీతాఫలం, అల్లనేరేడు, జామ చెట్లను శ్రీ సిద్దేశ్వర కొండగుడి పరిసర ప్రాంతంలో నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్తూరు అదనపు పథక సంచాలకులు మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా చెట్లు నాటడం ద్వారా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తదనంతరం నిర్వహించిన ఉపాధి హామీ పథకం సమీక్ష సమావేశంలో 2024–25 సంవత్సరానికి మంజూరైన మినీ గోకులాలు, 2025–26 సంవత్సరానికి ఆమోదం పొందిన మినీ గోకులాల పనులపై సమీక్ష నిర్వహించారు.