2000వ ఆగస్టు 28న విద్యుత్ ఛార్జీల వ్యతిరేక నిరసనలో బషీర్బాగ్ వద్ద పోలీసుల కాల్పుల్లో అమరులైన కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి 25వ వర్ధంతి సందర్భంగా గురువారం ఆదోనిలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి భీమాస్ కూడలి వరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అమరుల త్యాగాలకు గుర్తుగా ప్రతిజ్ఞ చేశారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని అన్నారు.