ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు ఆలయాలలో చంద్రగ్రహణం అనంతరం సోమవారం తలుపులు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలన్నిటిని మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున ఆలయాలను శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి, మార్కండేశ్వర స్వామి, అల్లూరి పోలేరమ్మ, తదితర ఆలయాలలో అర్చకులు ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు.