జిల్లాలోని మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో స్వామిత్వ గ్రౌండ్ ట్రూతింగ్ సర్వే జరుగుతున్న తీరును జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.బార్గవ తేజ గురువారం సాయంత్రం సందర్శించి పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న స్వామిత్వ సర్వే మరియు QGIS ద్వారా జరిగే ఆన్ లైన్ online విధానము తెలుసుకొని సర్వే మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామంలో సర్వే చేస్తున్న సిబ్బంది ద్వారా వివరములు తెలుసుకోగా మొత్తం 2405 ప్రాపర్టీ పార్సెల్ నెంబర్ (PPN) ఉండగా సర్వేలో మొత్తం 1290 ప్రాపర్టీ పార్సెల్ నెంబర్ (PPN) పూర్తి చేసినట్లు తెలుపగ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.