తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆటో స్టాండ్ వద్ద శుక్రవారం ఆటో డ్రైవర్లకు వాహనం నడిపేటప్పుడు నియమ నిబంధనలు గురించి అర్బన్ సిఐ బాబి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆటో వాహనాలను నడిరోడ్లో పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంచరాదని హెచ్చరించారు. ఆటో స్టాండ్ వద్ద ఒకటి తర్వాత ఒకటి సీరియల్ గా ఆటోలను పెట్టుకొని నడుపు కోవాలని సీఐ బాబి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అన్నారు.