సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా ఆదివారం నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీ ఆడెల్లి శ్రీ మహాపోచమ్మ ఆలయం, దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయం, కదిలి పాప హరేశ్వర ఆలయం, కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను మూసివేశారు. ఈ రోజు రాత్రి 9.58 గంటల నుంచి చంద్రగ్రహణం ప్రారంభంకానుంది. దీంతో మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణం వీడిన తర్వాత సోమవారం ఉదయం ఆలయాలను తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.