కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని లక్ష్మీ నగర్ కు చెందిన గూడ పుష్పలత అనే వివాహిత శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందినట్లు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు మృతురాలి భర్త మాధవరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.