మహేశ్వరం మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన బిజెపి నాయకులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో శనివారం మధ్యాహ్నం చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని అన్నారు. తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసిందని ఆమె తెలిపారు.