సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హోతికే లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పట్టాలు అందజేసిన లబ్ధిదారులకు విచారణ పేరుతో తాళాలు అందించకుండా కాలయాపన చేయడం సరైనది కాదని బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ రవికిరణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జహీరాబాద్ తహసిల్దార్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్ రూమ్ బాధితులతో ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం విచారణ చేపట్టిన అనంతరం అర్హులైన వారికి పట్టాలను అందజేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్ష కట్టి 132 లబ్ధిదారులకు విచారణ పేరుతో ఇళ్లను ఇవ్వకుండా అడ్డుకుంటుందన్నారు. పట్టాలిచ్చిన లబ్ధిదారులందరికీ ఇళ్ల తాళాలు అప్పగించాలని డిమాండ్ చేశారు.