జనహిత యాత్రతో ప్రజలకు ఒరిగేదేమి లేదని... జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో సోమవారం మద్య్హనం ఆయన మీడియాతో మాట్లాడారు. చొప్పదండిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ ఇంచార్జ్ నటరాజన్ అనేక సమస్యలు తెలుసుకుంటారని పొన్నం ప్రభాకర్ అన్నారని... కానీ ఒక్క సమస్య కూడా అడగలేదని తెలిపారు. 6 నిమిషాల 10 సెకన్లు మాట్లాడిన నటరాజన్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, గురించి మాత్రమే మాట్లాడారని చెప్పారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండగా నటరాజన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో యూరియ