జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కలికిరి మండలానికి చెందిన ఆరుగురు ఉపాధ్యాయులు ఎంపికైనట్లు కలికిరి మండల విద్యాశాఖ అధికారి కరిముల్లా గురువారం సాయంత్రం తెలిపారు.కలికిరి మండలం కలికిరి పట్టణంలోని మెయిన్ స్కూల్ హెచ్ ఎం ఎస్.మురాద్ షా వలి,చింతమాకుల పల్లి ఎంపిపి స్కూల్ ఎస్.జి.టి ఉపాధ్యాయురాలు డి.భారతి,ఎంపిపి ఎస్ మహాల్ ఉర్దూ ఉన్నత పాఠశాల ఎస్.జి.టి ఉపాధ్యాయుడు ఎస్.ఇజాజ్ అహ్మద్,బొమ్మరవారిపల్లి ఎంపిపిఎస్ ఎస్.జి.టి ఉపాధ్యాయురాలు ఎన్.సరిత,మూరేవాండ్లపల్లి ఎంపిపి ఎస్ ఎస్.జి.టి ఉపాధ్యాయురాలు బి.సుగుణ మేడికుర్తి జడ్పి హైస్కూల్ ఉపాధ్యాయుడు కె.సుబ్బా రెడ్డి ఎంపికయ్యారని తెలిపారు.