మైదుకూరు పట్టణంలో వైసీపీ రాష్ట్ర పిలుపు మేరకు చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం పోలీసుల బందోబస్తు మధ్య ఉత్కంఠభరితంగా కొనసాగింది. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అయితే ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, చివరికి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారని ఆయన తెలిపారు.