విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ రోజ్ గార్డెన్ లో మిలద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని మదర్స్ పాఠశాల ఆద్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.