అనంతపురం నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయం వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేపట్టారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన కార్యాలయం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ నిరసనను వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అన్ని విధాలుగా అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.