ఖేడ్ నియోజకవర్గంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో భాగంగా ఓయూ జేఏసీ రాష్ట్ర బంద్ పిలుపు మేరకు ఆందోళన నిర్వహిస్తున్న ఖేడ్ జేఏసీ కన్వీనర్ అలిగే జీవన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. దళిత యువకుడిపై దాడికి నిరసనగా ఖేడ్ బంద్‌కు పిలుపునిచ్చారు. అలిగే జీవన్ మాట్లాడుతూ.. మార్వాడీ వ్యాపారుల అరాచకాలు ఎక్కువయ్యాయని, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.