శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సాతంరాయిలో అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో శనివారం మధ్యాహ్నం హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 17 లోని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించడంతో ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను జెసిబి సహాయంతో హైడ్రా అధికారులు తొలగించారు. ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అక్రమ నిర్మాణాలు చేపట్టిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.