రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులను దిక్కుతోచని స్థితిలో కూటమి ప్రభుత్వం నెట్టివేసిందని యూరియా సరఫరా లో వైఫల్యం స్పష్టమవుతుందని జమ్మలమడుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సింగం శివమొహన్ రెడ్డి విమర్శించారు. గురువారం యూరియా కొరతపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.కూటమి ప్రభుత్వం అదిగో వచ్చేస్తోంది ఇదిగో వచ్చేస్తోందని రైతులకు చెబుతున్నారన్నారు. యూరియా ఒక మూట వెయ్యి రూపాయలు పెట్టి కొందామన్నా అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మండిపడ్డారు.